గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. హైదరాబాదులోని సైబర్ గేట్ వే టు లో జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ ఆధ్వర్యంలో “గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ “నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ ఎండి, డాక్టర్ వినయ్ కుమార్ సరికొండ ఫినిక్స్ సీఈవో డాక్టర్ రంగా సుధాకర్, మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
మన రోజు వారీ జీవితంలో ఏఐ అన్నది సర్వసాధారణమైపోయింది. రాబోయే కాలంలో ఏఐ గురించి నేర్చుకున్న వాళ్లకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పలు కంపెనీలు చాట్ బాట్ లను సృష్టిస్తూ ఉన్నాయి. మనమందరం ఆన్‌లైన్‌లో అనేక చాట్‌బాట్‌లతో సంప్రదిస్తూ ఉన్నాము. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ బాట్‌లలో చాలా వరకు AI ద్వారా పని చేస్తున్నవే. OpenAI, చాట్‌జిపిటి లాంటి వాటి ద్వారా వండర్స్ సృష్టించవచ్చని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కొత్త కొత్త ఆవిష్కరణల కోసం యువత కూడా ముందుకు రావాలి.
హెల్త్ డిపార్ట్మెంట్, రక్షణపరమైన సాంకేతికత, పరిశ్రమలలో ఏఐ అన్నది భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజ సంస్థలు AIలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఏఐ అవగాహనను అందించగలదు, ఎన్నో పనులను కూడా చేయగలదు. AI సాంకేతిక ప్రక్రియలను వేగవంతం చేయగలదు.