తెలంగాణా నిరుద్యోగులు ఎన్ని సంవత్సరాలనుంచో వెయిట్ చేస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ రానే వచ్చింది. మొత్తం 503 పోస్టులతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డతర్వాత విడుదలైన మొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు గ్రూప్-1 జాబ్‌లకు ఇంటర్వ్యూను తీసేసి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష తోనే ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మే 2వ తారీఖు నుండి మే 31 వరకు నెట్‌లో టీఎస్‌పీస్‌సీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయడానికి అవకాశం ఉంది.
వివిధ జిల్లాల నుండి హైదరాబాద్‌కు వస్తున్న నిరుద్యోగులతో ఇక్కడ సందడి గా ఉంది. నోటిఫికేషన్‌కు, పరీక్షకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రణాళికలు వేసుకుని చదవడంలో మునిగిపోయారు. నగరంలో వివిధ కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల దగ్గర కోళాహళంగా ఉంది. కోచింగ్ సెంటర్‌లకు పేరుగాంచిన అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్‌లలో గల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లకు విధ్యార్థులు వెళ్ళువెత్తుతున్నారు.