రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో అనేక కంపెనీలు రష్యాపై ఇదివరకే ఆంక్షలు విధించాయి. ఇప్పుడు రష్యా కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. ట్విటర్, ఫేస్‌బుక్,బీబీసీ,యాప్ స్టోర్ సర్వీసులను రష్యాలో బ్యాన్ చేసింది. రష్యా సైనిక దాడుల గురించి వస్తున్న సమాచార వ్యాప్తిని ఆపేందుకే రష్యా ఈ చర్యకు పాల్పడిందని తెలుస్తోంది. ట్విటర్, ఫేస్‌బుక్,యాప్ స్టోర్ లు అమెరికా కు చెందిన కంపెనీలు. బి.బి.సి. బ్రిటన్ కు చెందింది.
అంటే రష్యా అమెరికా మరియు బ్రిటన్ లతో ఇంటర్నెట్లో యుద్ధం మొదలు పెట్టిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే అమెరికాతో సహా పలు దేశాలు రష్యా సైనిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి, మరియు రష్యాను ఆంక్షలతో ముంచెత్తుతున్నాయి. రష్యా కూడా అదే రీతిలోనే వారికి రిప్లై ఇవ్వాలని భావిస్తున్నట్లుంది.