ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్,శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, చందానగర్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల సర్వేను వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పరిశీలించారు ఐఏఎస్ మయాంక్ మిట్టల్. ఆయనతో కలిసి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పలు ప్రాంతాలను సందర్శించారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి కులగణన సర్వేను పరిశీలించారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. కులగణన బీసీల బతుకులు మారడానికి ఓ గొప్ప కార్యక్రమం. డేటాను ఇవ్వకుండా దయచేసి వెనకడుగు వేయకండి. మీ కులం గురించిన వివరాలను ఇచ్చి భవిష్యత్తు తరాల బతుకును మార్చుకోవాలని దుండ్ర కుమారస్వామి హితవు పలికారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కులగణన సర్వేను హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లిలోని కొన్ని కాలనీలలో సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్, శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, చందానగర్ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, డాక్టర్ రవి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి పాల్గొన్నారు. కులగణన ఉపయోగాలను గురించి ప్రజలకు వివరించారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణన బడుగుల బంగారు భవిష్యత్తుకు బాట అని గుర్తు పెట్టుకోవాలి. ఎన్నో కులాలకు సంబంధించిన డేటా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.. ప్రభుత్వాలు వారికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాయి.
కులగణన అనంతరం ప్రభుత్వం చేపట్టే ‘అభివృద్ధి’ ఆయా కులాలకు దక్కుతాయనే విషయాన్ని కూడా గుర్తించాలి. బడుగుల అభివృద్ధి, సంక్షేమం మెరుగు అవుతాయని బలంగా నమ్ముతున్నాం. కులగణన కేవలం ఓ పార్టీకి సంబంధించిన అంశం కాదని మీరు గుర్తించాలి. ఎంతో మంది బీసీ నేతల ఆశయ సాధనకు ఓ బాట అని భావించాలి. సామాజిక న్యాయం సాధించడంలో కులగణన కీలక మలుపుగా మారనుంది. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కులగణన కూడా ఓ కీలక ఆయుధం. రాజకీయ రిజర్వేషన్లకు కులగణన ఆధారం అయితే తప్పకుండా ఎన్నో కులాలకు చెందిన వారు రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సాయి యాదవ్, గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, అడ్వైజర్ రమణ, దేవేందర్ శ్రీనివాస్ మరియు జిహెచ్ఎంసి , ఇతర అధికారులు పాల్గొన్నారు