సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వర్, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ టి శ్రీనివాసరావు, ఐపీఎస్.తో కలిసి ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను విజిట్ చేసి సైబరాబాద్ పరిధిలోని ఆయా చెరువుల వద్ద నిమజ్జన తీరును పరిశీలించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉన్న 3000 సీసీటీవీ కెమెరాలతో పాటు అదనంగా గణేష్ నిమజ్జనం జరిగే పాయింట్లు వద్ద ప్రత్యేకంగా 700 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనం జరిగే 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ సీసీటీవీ కెమెరాలు నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం అయినది. గణేష్ ఊరేగింపు మార్గంలో ఉన్నటువంటి 1000 సీసీటీవీ లు పోలీస్ కంట్రోల్ రూమ్ తో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించబడినవి.ఈసారి మొట్టమొదటిసారిగా 30 బాడీ వర్న్ కెమెరాలు ధరించిన క్షేత్రస్థాయిలోని పోలీస్ కానిస్టేబుళ్లు గణేష్ నిమజ్జనం వద్ద జరిగే ప్రతీ కదలికను పోలీస్ కంట్రోల్ రూమ్ తో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరవేస్తారు.తద్వారా గణేష్ నిమజ్జనం జరిగే తీరుతనులను ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నత అధికారులు పెట్రోలింగ్ సిబ్బందికి నేరుగా అవసరమైన సూచనలు ఇచ్చే వీలుంటుంది.సైబరాబాద్ పరిధిలోని ఇ డీ ఎల్ ట్యాంక్, సూరారం చెరువు, పల్లె చెరువు ట్యాంక్, దుర్గం చెరువు, ప్రగతినగర్ చెరువు, గంగారం చెరువు, హస్మత్ పేట్ చెరువు, జేపి నగర చెరువు, మల్కం చెరువు, రాయసముద్రం చెరువు, శామీర్ పేట్ చెరువు, పల్లె చెరువు, పట్టి కుంట చెరువు, కాముని చెరువు, ఆర్సీ పురం చెరువు, పీరం చెరువు, సూరారం చెరువు, సూర సముద్రం, బొబ్బిలి చెరువు తదితర చెరువుల వద్ద 4కీ హై రిజల్యూషన్ తో కూడిన 10 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్ లను ఏర్పాటు చేశారు. తర్ఫీదు పొందిన బృందాలచే వీటిని ఆపరేట్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం సజావుగా సాగేందుకు మూడు జోన్లలో కెమెరా మౌంటెడ్ వాహనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వాహనాలు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ 360 డిగ్రీల కోణంలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లోని ప్రతీ దృశ్యాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరవేస్తాయి. సైబరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ డ్రోన్లు 8 కిలోమీటర్ల మేర పరిధిని కవర్ చేస్తాయి. భద్రత ఇలా..సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నేడు, రేపు, ఎల్లుండి (8, 9 & 10 సెప్టెంబర్, 2022) తేదీల్లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం విస్తృత ఏర్పాట్లు చేశాము. గణేశ్ బందోబస్త్ కోసం మొత్తం (8,000) పోలీసు బలగాలను మోహరించాము. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని చెరువులు అన్నీ సీసీటీవీల పర్యవేక్షణలో ఉన్నాయి.ఈ సీసీటీవీల (పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్) కమాండ్ కంట్రోల్ సెంటర్ కు నేరుగా అనుసంధానించబడినవి.సైబరాబాద్ లో మొత్తం 36 స్టాటిక్ మరియు 54 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేయబడ్డాయి.గణేష్ నిమజ్జనం జరిగే ఊరేగింపు మార్గాల్లో సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు, సామాన్య ప్రజలు డ్రోన్‌లను ఎగురవేయడానికి అనుమతి లేదు.పౌరులకు సూచనలు:గణేశ్ వేడుకలను సజావుగా నిర్వహించడానికి సైబరాబాద్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. వాట్సప్ గ్రూప్ అడ్మిన్ జాగ్రత్తగా ఉండాలి గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాల వద్ద షీ టీమ్స్, క్రైమ్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచాము. చిన్నారులు, వృద్ధులు, మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సైబరాబాద్ షీ టీమ్స్ హెల్ప్ లైన్ నంబర్ 9490313747 కు కాల్ చేయగలరు. పౌరులకు ఏదేని అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే దయచేసి సైబరాబాద్ పోలీసులకు తెలియజేయండి. డయల్ -100 లేదా సైబరాబాద్ పోలీసుల వాట్సప్ నంబర్ -94906 17444 కు తెలియజేయగలరు.
