తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఆయన సతీమణి శ్రీమతి సుధా శ్రీ, కుమారుడు ప్రహ్లాద్ మోహన్ రావు తో కలిసి దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయక మంటపంలో అర్చక స్వాములు వేద ఆశీర్వచనం తో పాటుగా, స్వామి వారి శేష వస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలపల డాక్టర్ వకుళాభరణం మాట్లాడుతూ…. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. తాను తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న బీసీ రాజకీయ ఉద్యమ నిర్మాణంలో తనకు సంపూర్ణ శక్తిని ప్రసాదించాలని వేడుకున్నట్లు చెప్పారు.