మరో నాలుగు మండలాల్లో దళిత బంధు అమలు

ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్రంలో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలుపరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం, ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ తో పాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ‘దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సిఎం తెలిపారు.

సోమవారం జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో… ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు., జిల్లా పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సీఎం సెక్రటరీ శ్రీ రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొల్గొంటారని సీఎం తెలిపారు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions