ఫిల్మ్ నగర్ : శ్రీ గాయత్రి లక్ష్మీనరసింహ క్రియేషన్స్ లో, దశరద్ నార్వ దర్శకత్వంలో, కొండపాక రాంమూర్తి మరియు యాదగిరి ప్రొడ్యూసర్స్ గా, డివోపి జే. వెంకట్, నూతన నటీనటులు వెంకట్ బోత్స, రమేష్ మాచర్ల, సిరి, చైత్ర, హనుమ, వరప్రసాద్ లతో వాస్తవిక సంఘటనల ఆధారంగా “దక్ష నిలయం” అనే పేరుతో తెరకెక్కుతున్నటువంటి సినిమాకు “తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మెన్ A. పద్మాచారి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా A.పద్మాచారి గారు మాట్లాడుతూ…
మూఢనమ్మకాల మత్తులో ఉండి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి వారందరికీ “దక్ష నిలయం” సినిమా కనువిప్పు కలిగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ దశరద్ నార్వ గారు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్నారన్నారు. ఈ సినిమా అందరూ కుటుంబసమేతంగా చూడాల్సిన సందేశాత్మక చిత్రమని, ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్న కొండపాక రాంమూర్తి, యాదగిరి గార్లను చైర్మెన్ A. పద్మాచారి అభినందిస్తూనే, చిత్ర యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, అవార్డు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆశాభావం వ్యక్తం చేశారు.