చిల్కనగర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లాలోని, ఉప్పల్ 7 వ వార్డ్ చిల్కనగర్ ఎప్పటికి సమస్యల నగర్ గానే వార్తల్లో నిలుస్తుంది. చిల్కనగర్ ఏ గల్లీ చూసినా, డైనేజిలు పొంగిపొర్లుతున్నాయి, దింతో చిల్కనగర్ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగడమే కాకుండా, తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా మేం అన్ని చేస్తున్నాం అంటూ మీడియా ముందు మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
ఇక వివరాలోకి వెళ్తే.. చిల్కనగర్ ప్రజలకు గతంలో ఉన్న ఉప్పల్ ఎమ్మెల్యే కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు ఇప్పించారు. అయితే నిధులు విడుదల అయ్యి నిర్మాణం అయేసరికి చాలా సంవత్సరాలు పట్టింది, తీరా చూస్తే ఆ టెండర్ కి సమబందించిన కాంట్రాక్టర్, నిధులు రాలేదు అని తాళం వేసుకొని వెళ్లి పోయాడు. గత ఐదు నెలలుగా అది అలాగే నిరుపయోగంగా పడి ఉంది. ఒక కమిటీ హాల్ అనేది కాలనీ యువతకి, పెద్దవాళ్లకి ఎంతో ఊయోగపడాలి కానీ ఇలా నిరంపయోగంగా మూసి ఉండడం చూసి అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఇదే వార్డ్ లో కల్యాణపురి కాలనీలో సంపన్న వర్గాల ప్రజలు నివసించడం వల్ల, వాళ్లకి అడగ గానే కమిటీ హాల్ లు, పార్క్ లు అన్ని ఎప్పటికప్పుడు రెడీ అవుతున్నాయి కానీ చిల్కనగర్ కాలనీలు చిన్న చూపు చూడబడటం వల్ల ఎక్కడేసిన గొంగళి అక్కడే లా ఉంది కమిటీ హాల్ పరిస్థితి
చిల్కనగర్ ని ఒక ఓటు బ్యాంక్ గానే చుస్తున్నారు తప్ప అక్కడి డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోవట్లేదు. విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న వైర్లకు కనీసం పైపులు వేసే ఆలోచన కూడా చేయట్లేదు. అసలే వర్షాలు ఎక్కువగా పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కమిటి హాల్ కి ఆనుకోని ఉన్న కరెంట్ వైర్ల వల్ల షాక్ కి గురైయ్యే ప్రమాదం పొంచిఉన్న పరిస్థితిని ప్రజా ప్రతినిధులు గమనించి, చిల్కనగర్ లోని కమిటీ హాల్ త్వరగా ప్రారంభించాలని, అలాగే దానికి ఆనుకోని ఉన్నటువంటి కరెంట్ తీగల వల్ల షాక్ కొట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రాజలు డిమాండ్ చేస్తున్నారు.