ముదిరాజుల అభ్యున్నతికి బస్సుయాత్ర
ముదిరాజ్ కార్పొరేషన్ కు 2000 కోట్లు కేటాయించాలి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజ్‌ల చైతన్యమే లక్ష్యంగా ముదిరాజు ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం రోజు గన్ పార్క్ వద్ద నెల్లి లక్ష్మీనారాయణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్ర శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల పర్యటన మొదటి విడత బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యాత్ర విజవంతమవ్వాలని కోరుతున్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ముదిరాజు ప్రజా చైతన్య యాత్ర రెండు విడుతల వారీగా కొనసాగుతుంది. జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ముదిరాజులలోనే అత్యధిక పేదరికం తాండవిస్తూ ఉందని దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మత్స్యకార వృత్తి, వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులు, ఇతర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరినీ ఆదుకునేలా ముదిరాజ్ కార్పొరేషన్ కు 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. ముదిరాజులకు రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్ లభించడం లేదనే నిరాశ ఉంది. రాజకీయంగా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ అధికార పీఠానికి అందనంత దూరంలోనే ఉన్నారు. ముదిరాజ్ సామాజికవర్గాన్ని సభ్య సమాజంలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. శివ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజ్యంగ బద్ధంగా హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఈ యాత్ర తలపెట్టారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ ముదిరాజ్ఉ ప్పరి నారాయణ, చిన్న రాములు, కూర వెంకటయ్య, కోట్ల పుష్పల కోట్ల పుష్పలత, ప్రజా సంఘ నాయకులు, న్యాయవాదులు, మేధావులు కుల సంఘ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.