భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రూ.499కే ‘డీటెల్ డీ1’ పేరిట ఓ నూతన ఫీచర్ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. డీటెల్ సంస్థతో భాగస్వామ్యమైన బీఎస్ఎన్ఎల్ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌తోపాటు రూ.153 టారిఫ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తున్నది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రూ.103 టాక్‌టైం లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు చార్జి చేస్తారు. అలాగే ఇతర ఆపరేటర్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జి పడుతుంది. ఇక ఈ ప్లాన్‌కు వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. దీంతో సంవత్సరం పాటు ఈ ప్లాన్‌ను వాడుకోవచ్చు.
డీటెల్ డీ1 ఫోన్లో 1.44 ఇంచ్ మోనోక్రోమ్ డిస్ప్లే, ఫిజికల్ కీప్యాడ్, సింగిల్ సిమ్ స్లాట్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ, టార్చి లైట్, ఫోన్‌బుక్, ఎఫ్ఎం రేడియో, లౌడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.