భారతీయ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా పి సి ఆదిత్య ను నియమించడం జరిగింది వారితో పాటుగా కార్యాచరణ కమిటీని మరియు మెంబర్స్ నియమించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆగకుండా ప్రతి జిల్లాలో రాష్ట్రాలలో ప్రతి పౌరుడు ప్రజలను కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సంస్థ కార్యచరణ నిర్వహించాలని భారతీయ బ్రాహ్మణ సేవా సమితి చైర్మన్ కొండపాక రామ్మూర్తి వారికి దిశానిర్ధేశం చేశారు మరియు సంస్థను బలోపేతం చేయాలని మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రజలలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకం కావాలని కోరారు.అదేవిధంగా జాతీయ అధ్యక్షులు మూలం పల్లి శివ లింగేశ్వర శర్మ, జాతీయ ఉపాధ్యక్షులు వెంకటరమణాచార్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు మండవ మధుసూధన శర్మ మరియు సంయుక్త కార్యదర్శి లక్ష్మీ వెంకటరమణచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
