బయోమెట్రిక్ తప్పనిసరి
ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏప్రిల్ 1నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి కానుంది. శాఖాధిపతుల స్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వరకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మెమో విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా చేతిరాత ఫైళ్లు ఉండకూడదని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ-ఆఫీస్, కాగిత రహిత పాలనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.