- సూపర్ స్పైడర్స్ కు కరోనా టీకాలు ప్రారంభం
ఉప్పల్ : ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలో సూపర్ స్పైడర్స్ కు కరోనా టీకాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు , కీసర ఆర్డీఓ రవి గారు, ఉప్పల్
కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల్లో ఏ ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా పాల్గొనడం, ముఖ్యంగా అందరికి ఆదర్శంగా ఉండాల్సిన స్థానిక MLA బేతి సుభాష్ రెడ్డి గారు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం పై స్థానికులు మండిపడుతున్నారు.. కరోనా ఉదృతం గా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రజా నాయకుల తీరు పై చర్చ మొదలైంది.

ఈ కార్యక్రమంలో సల్ల ప్రభాకర్ రెడ్డి, సుంకూ శేఖర్ రెడ్డి, లింగంపల్లి రామక్రిష్ణ,అల్వాల్ భాస్కర, ఆలుగుల అనీల్ కుమార్,మంద మురళీ కృష్ణ రెడ్డి,సతు ప్రశాంత్ రెడ్డి, రాఘవేందర్ గుప్త,హనుమంతు,మంద సుమన్ రెడ్డి,ఢిల్లీ చంద్ర శేఖర్ రెడ్డి, జీతు రెడ్డి, కన్నమైనా నరేష్ తదితులున్నారు పాల్గొన్నారు.