ఈరోజు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండల్ మదాపూర్ లో బీసీ దల్ ఆఫీసులో జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కలవడం జరిగింది .ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది . మండల్ మహోద్యమం, బీసీల మార్పు కోసం బిసి బతుకు బిసి బాగు కోసం ప్రణాళికలు మరియు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ బ్రాహ్మణీయ భావజాలం నుంచి బయటపడమని, మహాత్మ జ్యోతిరావు పూలే బోధించాడని తెలియ చేసాడు. కులతత్వ మనువాదంన్ని సమాధి చేయమని అంబేద్కర్ ప్రబోధించాడు అని తెలియజేశారు. బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామిన మాట్లాడుతూ జనాభాలో బీసీలు సగ భాగంగా ఉన్నారని బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దోపిడీకి గురవుతున్నారని అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని సర్వ ఉత్పత్తులు బిసి ల ద్వారా జరుగుతుందని, అయినా బీసీలు వెనుకకు నెట్టి వేయ పడుతున్నారని తెలియజేశాడు. పార్టీలు బిసి ఓట్లను వాడుకొని వారు పెత్తనం చేస్తున్నారని, స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిన బీసీల బతుకుల్లో మార్పు లేదు తెలియజేశాడు. పార్లమెంటులో బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన దుండ్ర కుమారస్వామి
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్,శేర్లింగంపల్లి జోనల్...
Read more