భాగ్యనగరంలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన పలువురు పార్లమెంటు సభ్యులను కలుసుకున్న బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి వారికి బి.సి.లు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను వివరించి రానున్న పార్లమెంటు సమావేశాల్లో బి.సి. బిల్లును ప్రవేశపెట్టి లోక్ సభ మరియు రాజ్యసభల్లో బిల్లు ఆమోదానికి పార్టీలకు అతీతంగా అందరు కృషి చెయ్యాలని కోరారు. కేంద్రంలో బి.సి.లకు ప్రత్యేక మత్రిత్వ శాఖను ప్రకటించి దేశవ్యాప్తంగా బి.సిల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి తగిన నిధులు విడుదల చెయ్యాలని, వారికి విద్యా, ఉద్యోగ మరియు రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మరియు ఈసారి చేపట్టబోయే జనగణనలో బి.సి.ల సంఖ్యను శాస్త్రీయంగా లెక్కగట్టి జనాభా ప్రాతిపదికగా బి.లకు వివిధ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చెయ్యాలని అందులో 50 శాతం మహిళలు ఉండునట్లు చర్య తీసుకోవాలనే వివిధ న్యాయపరమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని భా.జా.పా పార్లమెంటు సభ్యులు డా.అశోక్ కుమార్ యాదవ్ (లోక్ సభ) గారికి మరియు శ్రీ.హరినాథ్ యాదవ్ (రాజ్య సభ)గారికి; బి.ఎస్.పి. ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు శ్రీ.శ్యాం సింగ్ యాదవ్ (లోక్ సభ) గారికి మరియు సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యులు శ్రీ. రాం గోపాల్ యాదవ్ (లోక్ సభ) గారికి కుమారస్వామి అందజేశారు. ఈసందర్భంగా గౌరవ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ బి.సి.ల బిల్లు విషయంలో తమ సంపూర్ణ సహకారాన్ని అందించి బి.సి. బిల్లు ఆమోదానికి ఉభయసభల్లో సహకరిస్తామని హామీ ఇచ్చారు.
