మాదాపూర్ (తొలిపలుకు న్యూస్) : వినాయక చవితి సందర్భంగా బీసీ దళ్ కార్యాలయంలో బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మట్టి గణేష్ ల పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కాలనీ వసూలు అధిక సంఖ్యలో పాల్గొని మట్టి గణేషుని విగ్రహాలు తీసుకెళ్లి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రజలకు కుమారస్వామి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వాతావరణం కాలుష్యం నివారించే విధంగా అందరూ మట్టి గణపతులతోనే పండగ జరుపుకోవాలని, ప్రకృతికి అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. మట్టి గణేష్ లతో వాతావరణాన్ని పరిరక్షించడంలో మనం భాగం కావాలన్నారు. ప్రజలు చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, సుఖాలు, సంతోషాలు లభించాలని కుమారస్వామి ఆకాంక్షించారు.
ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ వినాయక చవితిని క్షేమంగా జరుపుకోవాలని సూచించారు. వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదలు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరాతూ, కుమారస్వామి రాష్ట్ర ప్రజలకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.