నాపై అసత్య ప్రచారాలు మానుకోండి-మహ్మద్ షబ్బీర్ అలీ

  • తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరషన్ అధ్యక్షుడు.
  • లెకవ్యూ అపార్ట్మెంట్ షబ్బీర్ అలీ ఘాటు వ్యాఖ్యలు.

మేడ్చల్ :పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లేక్ వ్యూ అపార్ట్మెంట్ నివాసి మహ్మద్ షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
అపార్ట్మెంట్ వాసుల మధ్య జరిగిన గొడవ గురించి పలు విషయాలు తెలిపారు. 2013 నుండి 2019 సంవత్సరం వరకు ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయకుండా ఎక్కువ ప్లాట్లు కలిగి ఉన్న సురేందర్ అనే వ్యక్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఉండేవాడు. అపార్ట్మెంట్ లో వచ్చిన ఏ సమస్య పరిష్కరించ కుండా, అడిగితే మిగతా ఓనర్స్ని భయభ్రాంతులకు గురి చేసేవాడు.

ప్లాట్ ఓనర్స్ నుంచి ప్రతినెల మెయింటెనెన్స్ తీసుకుంటూ లెక్కలు చూపించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బిల్డింగ్ ప్లానింగ్ లో లేనటువంటి ఇల్లీగల్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయినా పెంట్ హౌస్ నిర్మించుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చి తోటి ప్లాట్ ఓనర్స్ ని ఇబ్బందులకు గురి చేస్తు మద్యం మైకంలో మహిళలను అసభ్య పదజాలంతో దూషించే వాడు. నిలదీసినందుకు నాపై కుట్ర పన్ని తన అనుచరుడైన ప్రసాద్ రాజును నా ఫ్లాట్ ఎదురుగా ఉన్న ప్లాట్ లో దింపడం జరిగింది. తను వచ్చినప్పటినుండి పై ప్లాట్స్ లో ఉంటున్న వారితో తో గొడవ పడడం వాచ్మెన్ భార్యని తిట్టడం, నా ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టి నా ఇంటి లోని బాత్ రూమ్, బెడ్ రూమ్ దృశ్యాలను చిత్రీకరించడమే కాకుండా ఇంటి ముందు నానా రభస చేస్తూ కత్తి తో నన్ను నా కుటుంబ సభ్యులను నరికేస్తాని బెదిరిస్తున్న ప్రసాద్ రాజు మీద మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కొత్త డ్రామాలు మొదలెట్టారు ఆరేండ్ల క్రితం నా దగ్గర అపార్ట్మెంట్ సంక్షేమం కోసం 16 వేల 5వందల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా, మెయింటినెన్స్ ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్లో నాపై పిర్యాదు చేశారు.
పోలీసులకు అసలు వాస్తవం వివరించడంతో నా పైసలు ఇప్పించి వారికి మొట్టికాయలు వేసి పంపించారు. స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో అపార్ట్మెంట్ రక్షణ కోసం 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాను.

మా అపార్ట్మెంట్ లో సురేందర్, ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా వారితో నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ వ్యవహారాలకు పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులకు హోం మంత్రి మహమూద్ అలీకి ఎలాంటి సంబంధం లేదు. నేను నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడను విద్యార్థి నాయకుడిగా టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేశాను. అనేక కేసులు ఎదుర్కొని పలుమార్లు జైలు జీవితం గడిపాను. తెలంగాణ ఉద్యమంలో అందరినీ భాగం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించి ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు లాక్ డౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశాను.

అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తు రాజకీయంగా ఎదుగుతున్న నాపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను నాపై వచ్చిన ఆరోపణలను నిజమని నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యల్తో నన్ను నా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రసాదరాజు పై పోలీసులు తగు చర్యలు తీసుకోని మాకు రక్షణ కల్పించాలి.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions