ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పగానే 24 మంది మంత్రుల రాజీనామా చేశారని అది తమ కమిట్మెంట్ అని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. తనకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది 11వ తేదీన తెలుస్తుందని నిర్ణయం ఏదయినా జగన్ గారి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం లో పాల్గొనడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛ్మైరన్లకు ఇదివరకే అధికారులకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఆఅ, ఆ1, ఆ2, భ్1, భ్2 కేటగిరీల్లో పాసుల పంపిణీ జరిగింది.
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతకుముందే గవర్నర్‌ని కలిసి చర్చించారు. ఇక ఈ కార్యక్రమానికి ముహుర్తం ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు పెట్టారు. ఆ తరువాత గవర్నర్, సీఎం తో పాత మరియూ కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది.