కేంద్రం మరో 54 చైనా యాప్ లను నిషేధించింది. వీటి వల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లుతుందని గుర్తించింది. ఇది మన దేశ వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్ లకు చేరవేస్తుందనీ వీటితో ప్రమాదం పొంచి ఉందని నిషేధించింది. ఇంతకుముందే కేంద్రం వందకుపైగా చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. వీటి వలన దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి సమస్య తలెత్తుతుందని పేర్కొంది. కేంద్ర హోం శాఖ సూచనలతో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
సోమవారం నిషేధించిన యాప్ లలో కొన్ని:
గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్
టెన్సెంట్ ఎక్స్‌రివర్
నైస్‌వీడియో బైదు
వివా వీడియో ఎడిటర్
బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ
మ్యూజిక్ ప్లేయర్
మ్యూజిక్ ప్లస్
వాల్యూమ్ బూస్టర్
వీడియో ప్లేయర్స్
యాప్‌లాక్
మూన్‌చాట్
బార్‌కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్‌స్కాన్