హైదరాబాద్: రోజు రోజుకు కరోనా ఉదృతి తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాక్ డౌన్ ని ఎంత కఠినంగా విధించినా కూడా, ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి కరోనా బారిన పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దు అనే ఉద్దేశ్యంతో, ఈరోజు M.J. మార్కేట్ ఎక్స్ రోడ్డులో పోలీసులు నిర్వహించిన కోవిడ్ 19 అవగాహన కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. ఈ వినూత్న కార్యక్రమంలో సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ…
తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి, దయచేసి మీరందరూ కోవిడ్ ఫొటోకల్స్ పాటించాలి, ప్రభుత్వం మినహాయించిన వారు కాకుండా మిగతా వారు అనవసరంగా రోడ్డు మీదకు వస్తే చట్టపరమైన చర్యలు కటినంగా ఉంటాయి అని తెలియజేశారు..