ఎలక్షన్లలో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలని బ్యానర్లు కట్టించి మరీ ప్రచారం చేసుకుంటున్నాడు ఔరంగాబాద్ లోని ఓ వ్యక్తి. అతని పేరు రమేశ్ పాటిల్. మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా అతను పోటీ చేయాలనుకున్నాడు. కానీ ముగ్గురు పిల్లలు ఉండడంతో అది కుదరకపోవడంతో ఈ అతనికి ఐడియా వచ్చింది.
రెండో భార్యను నిలబెడితే బెటర్ అనుకుని ఔరంగాబాద్ మొత్తం రెండో భార్య కావాలంటూ బ్యానర్లు వేయించాడు. అయితే వచ్చే ఆవిడకి మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నా సరేనట. ముగ్గురు ఉండకూడదు అని మాత్రం షరతు పెట్టాడు. తన ఫోన్ నంబర్ తో సహా ప్రింట్ చేయించి ప్రచారం చేస్తున్నాడు.
బాబు జగ్జీవన్ రామ్ కు జాతీయ బీసీ దళ్ అధినేత దుండ్ర కుమారస్వామి ఘన నివాళి
బాబు జగ్జీవన్ రామ్ కు జాతీయ బీసీ దళ్ అధినేత దుండ్ర కుమారస్వామి ఘన నివాళి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ్...
Read more