కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన జయభేరి పార్క్ బ్యాంకు కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తమ కాలనీలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, బోర్ వాటర్ లైన్స్, పార్క్ అభివృద్ధి వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు ఇంఛార్జి రాజేష్, కిట్టు, కాలనీ వాసులు సూర్యనారాయణ, రామ్ గోపాల్, గుప్త, జ్యోతి, సాయి లీలా, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.