ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని 7 వ వార్డు చిల్కనగర్ లో కాలనీల్లో
ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా జిహెచ్ఎంసి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుని అధికారుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా, తొలిపలుకులో వచ్చిన వార్త చూసి, స్థానిక నాయకులు వెంటనే స్పందించి, అక్కడి అధికారులతో మాట్లాడి, వెంటనే అక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం మొత్తం శుభ్రం చేయించారు..
దీనితో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, స్థానిక నాయకులు చేసిన మంచి పనికి వారిని అభినందిస్తూ జిహెచ్ఎంసి అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.. మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు..