మేడిపల్లి: మేడిపల్లి మండలం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ నగర కార్యదర్శి. రచ్చ కిషన్ అధ్యక్షతన సిపిఐ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఉప్పల్ బస్ డిపో ముందు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో బోడుప్పల్ & పిర్జాదిగూడ మున్సిపల్ సెక్రెటరీ లు రచ్చ కిషన్ మరియు ప్రమీల, మాట్లాడుతూ పెట్రోల్… డీజిల్ ధరలు అదుపు లేకుండా పెరగడం, సామాన్యుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదల ప్రత్యక్షంగా రవాణాపై, పరోక్షంగా అన్ని రకాల వస్తు సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు v b బాల్రాజ్, బోడుప్పల్ మరియు పిర్జాదిగూడ అసిస్టెంట్ సెక్రటరీ లు మాధవి, సోమరాజు, సిపిఐ పార్టీ నాయకులు మహాలక్ష్మి, యాదమ్మ, ఇస్తారి, చంద్రయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కె నాగజ్యోతి, జిల్లా కార్యదర్శి సి.ఎం.డి అన్వర్, చిన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more