హైదరాబాద్: తెలంగాణ ట్రాఫిక్ పోలీసు శాఖ వాహనదారుల విషయంలో రోజు రోజుకు ట్రాఫిక్ రూల్స్ మరింత కఠితరం చేస్తోంది. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ గానీ, బండికి సంబంధించిన పత్రాలు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ జారీ చేసిన జీవోను ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, ఆ హెల్మెట్ కూడా నాణ్యతతో కూడుకున్నదిగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా నాణ్యతతో లేని హెల్మెట్లను విక్రయించినట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS)కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రస్తుతం రోజురోజుకు రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కొత్త రూల్స్ అమలులోకి తెచ్చినా కూడా యాక్సిడెంట్లు తగ్గని పరిస్థితి నెలకొంది.
టూ విలర్స్ అయితే అతి వేగంతో దూసుకుపోవడం, మద్యంతాగి వాహనాలు నడపడం, రేసులో పాల్గొనడం, ఓవర్ టెక్ చేయ్యడం లాంటి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ దూసుకుపోవడం వల్ల నిత్యం ఏదో ఒక చోట ఎందరో ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నింటికి కారణం తలకు హెల్మెట్ దరించకపోవడమే ప్రధాన కారణంగా పరిగణనలోకి తీసుకుని, వాహనం నడిపే వారితో పాటు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని నిబంధనలు విధించారు ట్రాఫిక్ పోలీసులు.
లిద్దరికీ తలకు హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేయనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇలా ఇద్దరికి కూడా హెల్మెట్ ఉండాలని నిబంధనను చాలా సీరియస్ గా తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్లు కూడా నాణ్యతతో ఉన్నాయా? లేదా అనేది కూడా చూస్తున్నారు పోలీసులు.