ఉప్పల్ :ఉప్పల్ కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి లక్ష్మినారాయణకాలనీ, శ్రీరమణపురం కాలనీల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా బుధవారం పర్యటించారు.
లక్ష్మినారాయణకాలనీవాసులు ఈ సందర్భంగా కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి డ్రైనేజీ సమస్యను తెచ్చారు. దీనిపై స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించనున్నట్టుగా హామీ ఇచ్చారు.
శ్రీరమణపురంలోనూ డ్రైనేజీ, మంచినీటి సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తేవడంతో దశల వారిగా పరిష్కరించనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు లూకాస్ గారు ,రత్న రెడ్డి గారు ,బాబు రావు గారు ,బోడు రవీందర్ గారు ,నర్సింహా రెడ్డి గారు ,ప్రతాప్ రెడ్డి,రాజు గారు ,భాస్కర్ గారు ,అలెగ్జాండర్ ,రంగ రెడ్డి గారు ,అశోక్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు