టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్న ఆయన, ఓ కంపెనీ తనను కోట్లలో మోసం చేసిందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కీస్టోన్ అనే కంపెనీ తనను మోసం చేసిందని పేర్కొంటూ ఆదివారం ఉదయం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి “కీస్టోన్ ఇన్ఫ్రా” కంపెనీ పేరుతో తమ బిల్డర్స్‌తో ఫినిక్స్‌లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా ఉన్నాడని, తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఏడున్నర కోట్లు హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకొని తిరిగి ఇవ్వలేదని నరేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, తిరిగి చెల్లించమని అడిగినా వాళ్లు స్పందించకుండా, తప్పించుకొని తిరుగుతున్నారని నరేష్ తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more