మనం ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కలే కరోనా మహమ్మారి కాటేయ్యడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే చూస్తున్నాం కానీ టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు. అందుచేత
● దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి.
● తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి.
● చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి.
● ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.
● ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి.
● చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి.
● ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి.
● అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి.
● వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.
● వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి. అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.
● మీరు వారికి ఎంత ప్రాణస్నేహితులైనా కావచ్చు… లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు… వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి.
● ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి.
● అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి.
● ఇచ్చి పుచ్చుకోవడాలు మరికొంతకాలం ఆపేయండి.
● ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.
● స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more