మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ ఆర్ పి సి హెచ్ పి నందు టీబీజీకేఎస్ కార్మిక సంఘానికి ఫిట్ సెక్రెటరీగా నూతనంగా ఎన్నికైన కే శ్రీనివాస్ చారికి సింగరేణి బొగ్గుగని కార్మికుల యూనియన్ సభ్యులు డి నరసయ్య మోతే రాయల్ తిరుపతి రెడ్డి ,రమేష్ షణ్ముఖ చారి , కోటేశ్వరరావు, దుండ్రసదానందం (క్వాలిటీ సూపర్వైజర్) , నారాయణరావు ,జే ప్రభాకర్ సురేష్, క్లరికల్ ఉద్యోగులు మరియు ఇతర శాఖల కార్మికులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుండ్ర సదానందం మాట్లాడుతూ భూగర్భంలో ప్రకృతి విరుద్ధ ప్రాంతంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి బొగ్గుగని కార్మికుల శ్రమ, త్యాగాలే గొప్పవి.కార్మికుల హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి అని , యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి తెలియజేశాడు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైంది. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడింది అని తెలియజేశాడు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more