అగ్రసేన్ మహారాజ్ జీ విగ్రహానికి అమిత్ షా పూలమాలలు వేశారు
అగ్రసేన్ మహారాజ్ జీ జయంతి సందర్బంగా బుధవారం బంజారాహిల్స్‌లోని ఆయన విగ్రహానికి బిజెపి జాతీయ అద్యక్షులు అమిత్ షా పూలమాలలు వేశారు. అంతకు ముందు ఆయనను అఖిల భారత వైశ్ సమాఖ్య జాతీయాధ్యక్షులు, మాజీ ఎంపి డాక్టర్ గిరీష్‌కుమార్ సంఘీ స్వాగతం పలికారు.
అగ్రసేన్ విగ్రహానికి పూలమాలల సమర్పణ అనంతరం అమిత్‌షాను శాలు వాతో గిరీష్ కుమార్ సంఘీ సన్మానించి మెమోంటోను బహుకరించారు.తలపాగాను ధరింప చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెఎల్పీ నేత కిషన్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మరో నేత మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును గిరీష్‌కుమార్ సంఘీ, మంత్రి కెటిఆర్ అందజేసి సన్మానించారు.
వైశ్ సమాజానికి సేవలు అందించినందుకుగానూ ప్రభుత్వ సలహాదారు ఎకె గోయల్, మాజీ ఐఎఎస్ అధికారులు పి.కె. రస్తోగి, ఆర్‌ఎస్ గోయల్, వినోద్‌కుమార్ అగర్వాల్ తదితరులకు కూడా సన్మానం చేశారు.మూసీ రివర్స్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు అఖిల భారతీయ వైశ్ సమాఖ్య కీలక నేత బద్రి విశాల్ బన్సల్ వ్యాఖ్యాతగా వ్యవహరిం చారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, టిఎస్‌ఐడిసి చైర్మన్ గ్యాదరి మల్లేశ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి రాములు, గోపాల్ మోర్ ఇతర నేతలు పాల్గొన్నారు.