హైదరాబాద్ మెట్రోరైలు మొత్తం 46 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి
రాష్ట్ర రాజధాని ప్రజారవాణా చరిత్రలో మరో కీలకమలుపు! హైదరాబాద్‌లో తూర్పు, పడమర దిక్కులను కలుపుతూ మెట్రో రైలు పరుగులు పెట్టనున్నది! సోమవారం ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ కారిడార్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. 29 కిలోమీటర్ల మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో ఇప్పటికే అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు 13 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. 16 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు సోమవారం నుంచి పరుగులు పెట్టనున్నది. ఈ మార్గంలో దాదాపు 27 స్టేషన్లలో మెట్రోరైలు ఆగనున్నది.
గత ఏడాది నవంబర్ 28 నుంచి నాగోల్-మియాపూర్ మార్గంలో 30 కిలోమీటర్ల పొడవునా మెట్రోరైలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో సోమవారం నుంచి మొత్తం 46 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి రానున్నది. 46 కిలోమీటర్ల కారిడార్‌తో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా రూపుదిద్దుకోనున్నది.