2014 లో శాసనసభ సమావేశాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినా దానిపై ఎలాంటి ఉపయోగం లేకపోవడం బాధాకరమని , మరి ఇప్పుడు బీసీలకు మొండి చేయి చూపిస్తున్నారు . అన్ని రాజకీయ పార్టీలు బీసీల ఓట్లను చూస్తుందని బీసీలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని బాధాకరం వ్యక్తం చేస్తున్నాం అని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు .ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.ఇంకెన్నాళ్లు ఈ బానిసలుగా బ్రతకడం బీసీలు అంటే ఓట్ల కోసం ఉపయోగపడే మనుషులుగా చూస్తున్నారు, రాజ్యాధికారం మరెప్పుడు అని తెలియజేశాడు.నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన శాసనసభ టిక్కెట్ల కేటాయింపు జాబితాలో అగ్రవర్ణాలకు 52 సీట్లు కేటాయిస్తే బీసీలకు 26 సీట్లు కేటాయించడం చాలా బాధకరమని , కనీసం 55 మంది బీసీలు ఆ జాబితాలో ఉండాలని అని తెలియజేశారు.బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం పెంచాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు.