తెలంగాణ రాష్ట అసెంబ్లీ రద్దు…..అపద్ధర్మ సిఎంగా కెసిఆర్
గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకున్నారు.
తెలంగాణ మంత్రివర్గ ఆమోదం పొందిన అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని సిఎం కెసిఆర్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు గురువారం మధ్యాహ్నం 2గంటలకు అందించారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అపద్ధర్మ సిఎంగా కొనసాగాలని గవర్నర్ కెసిఆర్‌ను కోరారు. ఇందుకు కెసిఆర్ అంగీకరించారు. జూన్ 2, 2014న తెలంగాణ తొలి సిఎంగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన 4 ఏళ్ల 3నెలల 4 రోజుల పాటు తెలంగాణ సిఎంగా పని చేశారు.