నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు కు కారులో(Ap 28 BW 2323) మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ ప్రమాద సమయంలో తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిసింది.తెల్లవారుఝామున 4.30కి బయలుదేరిన కారు నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా అన్నేపర్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ప్రమాద సమయంలో కారు వేగంతో ప్రయాణిస్తోందని తెలిసింది.