బిహార్‌లో బస్సు అదుపుతప్పి ఘోర ప్రమాదం
బిహార్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. స్థానికులు కూడా వారికి సాయపడుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. తీవ్రంగా గాయాలపాలైన వారికి అక్కడే అంబులెన్సుల్లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.