పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు ఎదిగినా.. ఒదిగి వుండే నైజం.. జగధీశ్వర రెడ్డి ది
ఆయనే తెలంగాణ హోంమంత్రి దగ్గర ఓసిడి ఆఫీసర్ గా సాగుతున్న జగదీశ్వర్ రెడ్డి, ఆయనది నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు స్వస్థలం. నాన్న ఉపాధ్యాడు అవ్వడంతో చిన్నతనం నుండి చదువు పట్ల, కెరీర్ పట్ల ఓ నిర్ధిష్టమైన,బలమైన ఆత్మవిశ్వసమ్ నెలకొంది. అలా ఉన్నత చదువులు ఎం.ఏ ఆర్కియాలజి, ఎం.బి.ఏ చదివారు.
ఆ తర్వాత పోలీస్ అవ్వాలని కలలు కన్నా గాని ఒక్కడే కొడుకు అవ్వడంతో జగదీశ్వర్ రెడ్డి తల్లి ఒప్పుకోలేదు, దానికి కారణం అప్పోట్లో రాష్ట్రం లో నక్సల్స్ ప్రభావితం విపరీతంగా ఉండడం వలన అమ్మకు ఇష్టం లేదు, ప్రతి అమ్మకు ఇలాంటి భయం తప్పక ఉంటుంది అని భావించినా ఇంటి కన్నా దేశానికి నా అవసరం ఎంతో ఉందని భావించి, అలు పెరుగని సైనికుడు లా వెనుకడుగు వేయకుండా 1993 లో సబ్ ఇన్స్ పెక్టర్ పరీక్షలు రాశారు, కానీ ప్రభుత్వం మారడం వలన ఫలితాలు విడుదల చేయ లేదు, అప్పోట్లో ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారి దగ్గరికి 500 మందిని తీసుకెళ్లి, వారిలో ఐదుగురు సభ్యులను ముక్యమంత్రి అనుమతి ఇచ్చారు, దానిలో ఒకరు అయిన జగదీశ్వర్ రెడ్డి వాస్తవ పరిస్తుతులను కళ్లకు కట్టినట్టుగా ముఖ్యమంత్రి కి తెలియజేసారు, వెంటనె స్పందచి పరీక్షల ఫలితాలు విడుదల చేసినారు, దానితో ఉద్యోగం వచ్చేసింది, ఇది జగదీశ్వర్ రెడ్డి విజయానకి మొదటి మెట్టు అయింది. జగదీశ్వర్ రెడ్డి సిటీలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరో పక్క ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం, సైబర్ లా లను తన క్వాలిఫికేషన్ లో భాగం చేసుకున్నారు.
జగదీశ్వర్ రెడ్డి తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు..రాష్ట్ర ప్రభుత్వం ధ్వారా “ఉత్తమమైన సీ.ఎం గ్యాలెంట్రీ అవార్డ్, ఇండియన్ పోలీస్ మెడల్, , కఠిన సేవా పథకం, పోలీసు ఉత్తమ సేవ, కేంద్ర ప్రభుత్వం ధ్వారా అంతరిక్ష సురక్ష మెడల్ పొందినారు.
ఇవి మాత్రమే కాదు.. 200కు పైగా వివిధ కేసుల ఛేదనలో అందుకున్న అవార్డులు, రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ ఉన్నతాధికారుల నుండి గౌరవప్రదమైన ప్రశంస పత్రాలు, దేశ అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ నుండి అవార్డు ఇంకా మరెన్నో ..
ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అవినీతి నిరోధక శాఖ దాడి చేస్తే పొలాలు, బ్యాంక్ బాలెన్స్, పెట్టుబడులు, కేజీల బంగారం అంటూ వెలుగులోకి వస్తాయి కాని ఒక నిజాయితీ గల ఆఫీసర్ గురించి ఎంక్వేరి చేస్తే ఇలాంటి ట్రాక్ రికార్డ్స్ యే బయటపడతాయి..
1998 లో కంజర్ బటన్ గ్యాంగ్, బస్సులు ఆపి తలలు పగల కొట్టి, దోచుకొనేవారు, RC పురం సబ్ ఇన్స్పెక్టర్ తల పై కొట్టి చంపిరూ..ఆ గ్యాంగ్ ను తన దైన వ్యూహం తో వారిని ఆ డేంజర్ ముఠా ని కట కట లోకి నెట్టి పలువురి ప్రశముసలు పొందారు. విధి నిర్వహణ లో తన ధైనా శైలి లో వుంటూ సంగా వి ధృహులోకు సింహ స్వప్న గా నిలిచారు.
దిల్సూక్ నగర్ లో జరిగిన సాయిబాబా దేవాలయం లో బాంబ్ బ్లాస్ట్ కేస్ లో కీలక పాత్ర పోషించారు. LB నగర్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు, మహిళ న్యాయవాదుల చంపిన కేస్ లో24 గంటల వ్యవధిలో చాకచక్యంగా పురోగతి సాధించారు. పార్థి ముఠా చేసే భయంకరమైన ఆగడాలను అరికట్టి, 48 గంటల లో పట్టుకొని సంగ విద్రోహులకు సింహస్వప్నగా నిలిచారు. ఆనాడు పోలీస్ ఉన్నత అధికారి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ లో SOT శాఖ లో అందులో కీలక పాత్ర పోషించారు.
ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు 20 సంవత్సరాలకు పైగా సర్వీస్ లో ఎంతోమందిని అదుపులోకి తీసుకున్నారు. వేల కేసులను సమయస్పూర్తితో సులభంగా పరిష్కరించారు. ట్రాక్ రికార్డ్ అంటే ఉద్యోగ పరంగా మాత్రమే కాక సేవా కార్యక్రమంలో కూడా విస్తృతంగా పాల్గొంటారు. కొంతమంది పేద పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించడంతోపాటు వీలున్నప్పుడల్లా వివిధ రూపాలలో సమాజానికి తన సహాయం అందజేస్తుంటారు. ర్రాష్ట్ర హోంమిస్టర్ తో ప్రశంలు పొందినారు మరియు కేంద్ర హోమ్ మినిస్టర్ చే అభినందిబడినాడు .