అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు
జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు తొలి కాంస్య పతకం అందించిన అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు. అరుణ ప్రదర్శనను చూసి దేశం గర్వపడుతున్నది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలి అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్ వాల్ట్ విభాగంలో సంచలనాలు సృష్టించిన తెలంగాణ అమ్మాయి బుడ్డా అరుణారెడ్డి.. ఫ్లోర్ ఈవెంట్‌లో నిరాశపర్చింది. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో అరుణ 10.833 పాయింట్లతో ఏడోస్థానంతో సరిపెట్టుకుంది. ప్యార్లర్ బార్స్ ఫైనల్స్‌లో రాకేశ్ పాత్రా 13.433 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచింది. స్వర్ణం పతకం సాధించిన జియోమింగ్ వు (చైనా) కంటే 1.400 పాయింట్లు తక్కువ. ఢిల్లీ కామన్వెల్త్ ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేత ఆశిష్ కుమార్.. వాల్ట్ విభాగంలో 13.583 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.