దోమలను తరిమికొట్టేందుకు మార్కెట్‌లో అనేక ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. అయితే వీటికోసం చాలా ఖర్చు చేయడంతోపాటు, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలున్నాయి. దోమల నుంచి విముక్తి పొందేందుకు వంటింటి చిట్కా చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఈ క్యాప్సుల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిందే! ఇవి కళ్ల కింద ఉండే నల్లని వలయాలను పొగొట్టడంతోపాటు పింపిల్స్ సమస్యను దూరం చేస్తాయి. ఇంతేకాదు దోమలను తరిమికొట్టడంలో విటమిన్ ఈ భేషుగ్గా పనిచేస్తుంది. దీనిని బాదం నూనెలో కలిపి శరీరానికి రాసుకోవడం ద్వారా దోమలు సమీపంలోకి రావు. ఈ మిశ్రమం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉండవు. దీనిని తయారు చేసుకునేందుకు ఖర్చుకూడా స్వల్పమే. ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లో మూడు చెమ్చాల బాదం నూనె తీసుకోవాలి. దానిలో విటమిన్ ఈ క్యాప్సుల్స్‌లోని ఆయిల్‌ను వేసుకోవాలి. తరువాత దీనిని బాగా కలిపి శరీరానికి అప్లయ్ చేయాలి. తద్వారా దోమలు దరిచేరవు.
Blissberg Future of Hope ఆధ్వర్యంలో పంచ ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఏప్రిల్ 7, 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా "అందరికీ మంచి ఆరోగ్యం 2025" అనే గొప్ప లక్ష్యంతో బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్...
Read more