భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని జ్ఞానభూమి వద్ద పీవీకి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాళులర్పించారు.
దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలు మరువలేనివి అని నేతలు కొనియాడారు. పీవీ రాజకీయ చాణుక్యుడు అని పేర్కొన్నారు.