హెచ్1బీ వీసాదారులకు
షాక్ ఇచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఇంత వరకు ఉండేది. ‘బై అమెరికన్-హైర్ అమెరికన్’ అని ఏప్రిల్‌లో ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వెసులుబాటును కల్పిస్తూ 2015లో నిబంధనలు తెచ్చారు. దాని ప్రకారం కొందరు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడా నిబంధనను రద్దు చేయాలని భావిస్నున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.