చెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది.
రాగమౌనిక ఆత్మహత్య వెనుక యాజమాన్యంపై ఆరోపణలు రావడంతో వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం రాత్రి వర్సిటీ ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోమవారం జరిగిన కెమిస్ట్రీ ఇంటర్నల్ పరీక్షల్లో రాగమౌనిక కాపీకి పాల్పడిందని యాజమాన్యం చెబుతోంది. ఆ కారణంగానే మంగళవారం కూడా ఆమెను పరీక్షకు అనుమతించలేదు. అందరి ముందే పరీక్ష హాల్ నుంచి ఆమెను బయటకి పంపించేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
గదిలో రాగమౌనిక ఒక్కరే ఉండటం.. తీవ్ర మనస్తాపం చెంది ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడింది.