సమాాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన పర్యాటకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరగబడిన బోటు ఓ ప్రయివేటు సంస్థకు చెందినది. మంగళగిరి నుండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కార్తీక వనసమారాధనకు వెళ్లిన పర్యాటకులు అనుకోకుండా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పరిమితికి మించి బోటులో ప్రయాణీకులు ఎక్కిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తుంచారు.
కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. ఇందులో 38 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఫెర్రీఘాట్ వద్ద ఈ పర్యాటకుల బోటు తిరగబడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నీట మునగగా వీరిలో కొందరిని సిబ్బంది, పోలీసులు, స్థానిక జాలర్లు రక్షించారు. గల్లంతైన ప్రయాణికుల కోసం సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 14 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.