క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి
క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ లో క్రికెటర్ ధృతి కేసరిని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మలేషియా వేదికగా సాగిన మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ ను భారత్ సొంతం చేసుకుంది. భారత జట్టులో భాగమైన కేసరి ధృతిని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి సన్మానించారు.
డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ క్రీడలు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి అని తెలిపారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ధృతి కేసరికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని, తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రికెటర్లు ఎదగడానికి ప్రభుత్వం తోడ్పాటును అందించేలా చేస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి హామీ ఇచ్చారు. ధృతి కేసరి తెలంగాణలో ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శమని, మహిళా క్రీడాకారుల ఎదుగుదలకు జాతీయ బీసీ దళ్ అండగా ఉంటుందని దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు.
