బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల ఎప్పుడు? వకుళాభరణం కృష్ణమోహన్
కులగణన తో బీసీల బంగారు బాట -జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
సంపూర్ణంగా{100%} కుల సర్వే పూర్తి అయ్యాక స్థానిక సంస్థలఎన్నికలు నిర్వహించాలి
అసమగ్రంగా కుల సర్వే నిర్వహించబడినందున తిరిగి 15 రోజులు ప్రత్యేక డ్రైవ్ తో కుల గణన పూర్తి చేయాలి
అన్ని ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులలో 50 శాతం బీసీలకు అవకాశం ఇవ్వాలి
.
సంస్థాగతంగా అన్ని రాజకీయ పార్టీలు జిల్లా అధ్యక్షులుగా, అన్ని పదవులలో బీసీలకు 50% అవకాశాలు కల్పించాలి
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన బిసి కుల సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, కుల సంఘాల ప్రతినిధులు, వక్తల డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వంకు బీసీల అభివృద్ధి, సంక్షేమం, ప్రజా ప్రాతినిధ్యం పెంపుదల పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ అమల్లోకి తేవాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తేవాలని సమావేశం ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని కోరింది.
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ….సుప్రీం కోర్ట్ తీర్పును సాకుగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మొండి చేయి చూపిస్తే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ల అమలు హామీని నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, లార్జెర్ బెంచ్ కై విజ్ఞప్తి చేయాలి,నిబద్దతగా వాదనలను వినిపించి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.
ఆదివారం నాడు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి వేదిక అధ్యక్షుడు కాటo నరసింహ యాదవ్ సభాధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్ ,వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పీ న్ చారి, ప్రొఫెసర్ బాల ప్రకాష్, విశ్వనాథ్ ముదిరాజ్, ఏ వెంకటేష్ వేదిక నగర అధ్యక్షుడు ఉపాధ్యక్షులు,బి రాజేష్ యాదవ్ సంఘం నగరం అధ్యక్షుడు, టి శ్రీరాములు సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు రేణుక , బి వేణుమాధవ్ దావా శ్రీనివాస్ , దాదాపు రాష్ట్రంలో ని 40 కుల సంఘాలు ,ప్రజా సంఘాలు ,సామాజిక వేత్తల , తదితర వేదికల ప్రతినిధులు పాల్గొన్నారు.
డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ..
గతంలోని స్థానిక ఎన్నికలకు సంబంధించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్ట రాజ్యాంగ ధర్మాసనం అయిదుగురు న్యాయమూర్తులతో కూడినది కాగా ఆ తీర్పును మార్పు చేసే అధికారం ఏడుగురు లేదా తొమ్మిది మంది తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కు అధికారం ఉంటుంది.
కావున లార్జెర్ బెంచ్ గురించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి, కుల సర్వేతో అందుబాటులోకి వచ్చిన గణాంకాలతో వాదనలను వినిపించి బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీ కులాలను ఉప వర్గీకరణ చేసి ఆ ఎన్నికలలో ప్రజలందరికీ న్యాయం చేయాలని సమూచితంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ.
భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఆర్థిక సామాజిక రాజకీయంగా వెనుకబడుతూ అప్పులతో ఆకలి చావులతో ముంబాయి దుబాయ్ లకు వలసలు పోతున్నారు అన్నారు.
దేశంలో 75 కోట్ల జనాభా ఉన్న బీసీలు వారి న్యాయబద్ధమైన హక్కులైన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు., కోసం దశాబ్దాలుగా పోరాటం చేసిన కేంద్ర ప్రభుత్వం పక్క న పెట్టడం చాలా బాధాకరం అని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహించి రాష్ట్రంలోని బీసీలకు ఎంతో మంచి చేసింది..
. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడం శుభసూచికమని, కులగణనపై బీజేపీ మంత్రులు, ఎంపీలు దేశవ్యాప్తంగా చేయాలని ప్రధానిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్ ప్రవేశ పెట్టాలి. యువత, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే.
సభలో ఓబిసి మోర్చ్ రాష్ట్ర అధ్యక్షులు ఆనందగౌడ్ మాట్లాడుతూ
నగరంలో 40% కూడా కుల సర్వే సమగ్రంగా జరగలేదని విమర్శించారు.
అందుబాటులోకి వచ్చే ఈ సమాచారంతో జిహెచ్ఎంసి ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లయితే, బీసీలకు తక్కువ సీట్లు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నగరంలో పూర్తిస్థాయి సామాజిక కుల సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాటం నరసింహ యాదవ్ మాట్లాడుతూ…
బీసీలను అన్ని సందర్భాలలో ఓట్లు వేసే యంత్రాలుగానే పరిగణిస్తున్నారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులలో, ఇతర సమస్త గత పదవులలో 50% ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాట్లాడిన పలువురు వక్తలు ప్రభుత్వం నియమించబోయే అన్ని నామినేటెడ్ పదవులలో బీసీలకు జనాభా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినప్పటికీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేశారు.
ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. సంక్షేమ హాస్టల్లలో, గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు విష ఆహారం తిని మృత్యువాత పడుతున్నప్పటికీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తుండడం పట్ల పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేలకోట్ల బోధనా రుసుముల బకాయిలను వెంటనే చెల్లించాలని పలువురు డిమాండ్ చేశారు. బీసీల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు.