వచ్చే జనాభా గణనలో కులగణనను చేపట్టాలని మేధోమథనం కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
దేశంలో బిసిలను రెండవ తరగతి పౌరులుగా చూస్తుండడం పట్ల నిరసన వ్యక్తం చేసిన మేధావులు, సామాజికవేత్తలు.
రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమానత్వంకై పోరుబాటకు నిర్ణయించిన మేధోమథనం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్14, 15, 16, 18, 19, 21, 22, 38, 39, 243 (డి), 243 (టి), 340, 7వ షెడ్యూల్ లిస్టు
1, 2 మరియు 3 లలో ఉన్న క్ర.సం. 20, 23, 24, 30, 45 లు, వాటి స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడంలో వైఫల్యం అవుతున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించిన మేధోమథనం.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులసర్వేను సంపూర్ణస్థాయిలో నిర్వహించాలి. ఆ సమాచారం, గణాంకాల ఆధారంగా బిసిల విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్‌లను పెంచాలని డిమాండ్.
బిసిలను ఓటు బ్యాంకులుగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే పరిగణిస్తుండడం పట్ల వెల్లివిరిసిన నిరసన.
బిసి రాజకీయ సిద్ధాంత భావజాల వ్యాప్తికి వివిధ రూపాలలో కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయం.
స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బిసిలకు రిజర్వేషన్‌ల అమలుకు న్యాయ నిపుణులతో చర్చించి, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన మేధోమథనం సదస్సు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ జాబితాను ఉప కులాల వారీగా వర్గీకరించి, 42% రిజర్వేషన్‌లను అమలులోకి తేవాలి.
బిసిలకు చట్ట సభలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌లు కల్పించకుండా, రాజకీయ ప్రాతినిథ్యం సాధించకుండా, సమాజంలో అసమానతలు తొలగిపోవడం అసాధ్యమని బిసి మేధోమథన సభ అభిప్రాయపడిరది. 75 ఏళ్ల స్వాతంత్య్రం, 75 ఏళ్లుగా రాజ్యాంగం అమలు అనంతరం కూడా బిసిలు ప్రజా ప్రాతినిధ్యంను సమానత్వంగా సాధించని కారణంగా రాజకీయ అంటరానితనంను ఇప్పటికి అనుభవిస్తున్నారని మేధోమథనం తీవ్ర నిరసనను వ్యక్తంచేసింది. ఈ వర్గాలను ఎంత సేపూ ఓట్లేసే యంత్రాలుగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే పరిమితం చేస్తుండడంతో సమాజంలో తీరని హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని మేధోమథనం విచారంను వ్యక్తంచేసింది. శనివారం నాడు నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘75 సం॥ల భారత రాజ్యాంగం ` రాజకీయ అంటరానితనంలో బిసిలు’’ అనే అంశంపై మేధోమథన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసి కమిషన్ మాజీ ఛైర్మన్, జాతీయ సామాజిక న్యాయవేదిక సమన్వయ కర్త డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షత వహించారు. , ఆచార్య కె.మురళీమనోహర్, సామాజిక తత్త్వవేత్త బి.ఎస్.రాములు కీలక ఉపన్యాసాలు చేశారు. కార్యక్రమ సమన్వయ కర్తలుగా దేవళ్ల సమ్మయ్య, కొట్టె సతీష్‌లు వ్యవహరించారు. జనాధిక్య కులాలు, జనంలేని కులాలుగా బిసిలను విడదీసి ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు ఇన్నాళ్లుగా బిసిలలో అనైక్యతను పెంచుతున్నాయనే దిశగా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆధిపత్య వర్గాలు రాజకీయంగా తమ ఎదుగుదలే లక్ష్యంగా పైకి కనిపించని ఎజెండాలతో బిసిలను వాడుకుంటున్నాయని, అణిచివేస్తున్నాయని బహిరంగంగానే పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే బిసిలను ఏకం చేసే విధంగా రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని మేధోమథనం ఏకగ్రీవంగా తీర్మానించింది.
దేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మున్నగు రాష్ట్రాలలో బిసిలే పార్టీలను పెట్టుకొని రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అది ఎందుచేత సాధ్యం కావడం లేదు అనే దిశగా చర్చోపచర్చలు జరిగాయి. అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని, వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావలసిన కార్యాచరణను రూపొందించాలని, ప్రణాళికబద్దంగా ఉద్యమాలను నిర్మించాలని మేధోమథనంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు బిసిలకు అన్ని రంగాలలో జరిగిన అన్యాయాలపై సోదాహరణంగా, సాధికారికంగా అనేక సంఘటనలు, గణాంకాలు, సమాచారాలతో సవివరంగా పలువురు మేధోమథనంలో చర్చించారు.
ఈ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విశ్రాంత, ప్రస్తుత ప్రొఫెసర్‌లు, సామాజిక వేత్తలు, జర్నలిస్టులు, వివిధ రంగాల నిపుణులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, కులసంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రధానంగా రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాడి వేడిగా సాధికారికంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ సగటు మనిషికి కావలసిన ఆహారం, నీరు, గుడ్డ, గూడు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సంరక్షణ లాంటి కనీస అవసరాలు కూడా అందనీ పరిస్థితిలో బీసీలు ఉన్నారని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలు, సమన్యాయం, సమాన స్వేచ్ఛ లభించే విధంగా కేంద్రం కృషి చేయడం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తమకు అవసరమైతే భారత రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్ధంగా ఉంటుంది కానీ బీసీల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. బీసీలంతా కలిసికట్టుగా పని చేస్తే ప్రధానిని మార్చగలిగే పవర్ ఉందని గుర్తుంచుకోవాలి.
ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కులగణన చేయాలని చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. రాజ్యాధికారంలో ఓబీసీలకు న్యాయమైన వాటా దక్కేంత వరకు జాతీయ బీసీ దళ్ దేశవ్యాప్తంగా గొంతెత్తి నినదిస్తూనే ఉంటుందని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసి కమిషన్ మాజీ ఛైర్మన్, జాతీయ సామాజిక న్యాయవేదిక సమన్వయ కర్త డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షత వహించారు
ఈ మేధోమథనంలో పాల్గొన్న ప్రముఖులు : పి.ఎల్. విశ్వేశ్వరరావు, , జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి,
ప్రొ॥ నరేంద్ర బాబు, ప్రొ॥ పార్థసారథి, డా॥ ఎస్.పృథ్వీరాజ్, ప్రొ॥ భాస్కర్, సొగర బేగమ్, ప్రొ॥ భాగయ్య, డా॥ కోరె రాజ్‌కుమార్, డా॥ అంకం, లయన్ వేణుమాధవ్, ఆకర్ష్, పాల్వాయి శ్రీనివాస్ నాయీ, గుజ్జ రమేష్, పులిపాటి శ్రీనివాస్, మేరు భాస్కర్‌రావు, రాచమల్ల బాలకృష్ణ, నర్మద, విజయ ధర్మపురి, సతీష్ కొట్టె, కొంగర శ్రీరాములు, కోలా శ్రీనివాస్, ఎం.ఎన్.మూర్తి, కొండా వెంకటరమణ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కిరణ్, డా॥ దత్తాత్రి, ఓయు విద్యార్థి నాయకులు మధు, రాజేందర్, ప్రొ॥ కవిత, ప్రొ॥ రమాదేవి, రాచమల్ల బాలకిషన్, శ్రీమతి ఎం.భాగ్యలక్ష్మి, సాయి పటేల్, తాండూరు రాజ్‌కుమార్, వివిధ రంగాల నిపుణులు, సామాజిక వేత్తలు, కులసంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ మేధోమథనం సుమారు 5 గం.ల పాటు కొనసాగింది.
గురువారం నాడు మరణించిన దివంగత మాజీ ప్రధానమంత్రి డా॥ మన్‌మోహన్ సింగ్‌కు మేధోమథనం సభ ఆరంభంకు ముందు సంతాప సూచకంగా మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు.
మేధోమథనం అనంతరం కార్యక్రమ వివరాలను, తీర్మానాలను, భవిష్యత్ కార్యాచరణను డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఆచార్య కె.మురళీ మనోహర్‌లు మీడియాకు వివరించారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img,w_300,h_108/https://www.tholipalukunews.com/wp-content/uploads/2024/12/IMG_20241228_115700-840x304.jpg)
Brainstorming session on the topic of ‘BCs in Political-Untouchability’ in the Indian Constitution participants National President BC Dal Dundra kumara Swamy &prof vishweshwar rao