సామాజిక దార్శనికుడు అంబేద్కర్
సామాజిక న్యాయం, సమానత్వం సాధనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
శేర్లింగంపల్లి మండలం, సాయి నగర్ కాలనీలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చీటూరి అశోక్, సామాజికవేత్తలు, కార్మికులు, మేధావులు ప్రజా సంఘ నాయకులు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేస్తుందన్నారు.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహోన్నత నాయకుడు బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు..అంబేద్కర్ పోరాటమంతా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగానే కొనసాగింది. అలాంటి మహోన్నత వ్యక్తిని ఈ స్మరించుకోవడం మంచి సందర్భమని గుర్తు చేశారు..ఓ న్యాయవేత్తగా ఓ ఆర్థికవేత్తగా గొప్ప సంఘ సంస్కర్తగా ఓ మంచి రాజకీయవేత్తగా అన్నింటికీ మించి రాజ్యాంగ రూపకర్తగా పేరుపొందిన లీడర్ అని తెలిపారు. మహిళలు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని.. సామాజిక వివక్షను కుల వివక్షను నిర్మూలించడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని దుండ్ర కుమారస్వామి కొనియాడారు.