వైద్యులు చేసే సేవలు: వెలకట్టలేనివి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
సిగ్మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మన సమాజంలో నడిచే దేవుళ్ళు వైద్యులు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రాణం పోసే వాడు దేవుడైతే, ప్రాణాలను నిలబెట్టే వారు వైద్యులు. వైద్యులను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అని అంటారన్నారు దుండ్ర కుమారస్వామి.
శేర్లింగంపల్లి మండలంలోని మాదాపూర్ కి చెందిన గఫూర్ నగర్ లో సిగ్మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సిగ్మా హాస్పిటల్ డైరెక్టర్ J. శ్రీనివాస్, వైద్య బృందం పర్యవేక్షణలో ఉచిత వైద్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అపార్ట్మెంట్లో నివసించే ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచిత రక్త పరీక్షలు, బీపీ-షుగర్ టెస్టులు చేశారు. ఉచితంగా మందుల పంపిణీ కూడా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ డాక్టర్స్ ఎన్నింటినో త్యాగం చేసి ఈ స్థాయికి వచ్చారు. వైద్యులు చేసే సేవలు అనన్యమైనవి, అమోఘమైనవి. వారికి సమాజమంతా సహకరిస్తూ, అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో రక రకాల వ్యాధులు, వైరస్ లు వ్యాపిస్తున్నాయి. అయినా కూడా మార్పులకనుగుణంగా వైద్యులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రోగులకు సేవలందిస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు దుండ్ర కుమారస్వామి. ఈ ఉచిత వైద్య శిబిరంలో రామ్ గోపాల్ రెడ్డి, గురు బచ్చన్ సింగ్, హైదరాబాద్ ఆప్సో ప్రెసిడెంట్, మారుతి శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.