బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ సిల్వర్ స్క్రీన్ కు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘నెక్స్ట్ నువ్వే’. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్, బన్నీ వాస్ లు సంయుక్తంగా వి4 బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
సీరియల్స్ ను డైరెక్ట్ చేసే కిరణ్ (ఆది) ఒక లోకల్ గుండాకి ఇవ్వాల్సిన అప్పు కారణంగా సిటీ నుండి పారిపోయి అరకులో తన తండ్రి సంపాదించిన ఒక బంగ్లాకు వెళ్లి, దాన్ని రీమోడలింగ్ చేయించి రిసార్ట్స్ గా మార్చి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. కానీ రిసార్ట్స్ కు వచ్చిన గెస్టులంతా చనిపోతుంటారు.
దీంతో అయోమయంలో పడ్డ కిరణ్ అసలు వాళ్ళ చావుకి కారణమేమిటో తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి ఆ ఇంట్లో దెయ్యముందనే విషయంతో పాటు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ దెయ్యం ఎవరు, అది రిసార్ట్స్ లో ఎందుకుంది? కిరణ్ తెలుసుకున్న నిజాలేమిటి? చివరికి కిరణ్ తన రిసార్ట్స్ ను ఆ దెయ్యం బారి నుండి కాపాడుకున్నాడా లేదా? అనేదే ఈ సినిమా కథ.
తీర్పు :
దర్శకుడిగా ప్రభాకర్ చేసిన తొలి ప్రయత్నం ‘నెక్స్ట్ నువ్వే’ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. బ్రహ్మాజీ కామెడీ, పర్వాలేదనిపించే ఫస్టాఫ్ ఇందులో మెప్పించే అంశాలు కాగా ఒక సరైన కథ, కథనం లేకపోవడం, నాటికలా సాగదీయబడిన సెకండాఫ్, కంక్లూజన్ అంటూ లేని క్లైమాక్స్, అనవసరమైన పాత్రలు, సన్నివేశాల ప్రవేశం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా హర్రర్ కామెడీని కోరుకునే వారికి పర్వాలేదనిపిస్తుంది కానీ రెగ్యులర్ ఆడియన్సుని ఆకట్టుకోదు. మొత్తానికి విషయం తక్కువ.. హడావుడి ఎక్కువ అన్నచందంలా సాగింది ప్రభాకర్ తీసిన మొదటి సినిమా.
Source: ToliVelugu