టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా సురేష్ యాదవ్
యువతకు స్ఫూర్తి సురేష్ యాదవ్
టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ గా నియమితులయ్యారు యువ నేత యు.వి.సురేష్ యాదవ్. ఏఐసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్, హర్యానా మాజీ మంత్రి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ సురేష్ యాదవ్ కు నియామక పత్రం అందజేశారు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ సింగ్ యాదవ్‌కు సురేష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీల సంక్షేమానికి కృషి చేస్తానని యూవీ సురేష్ యాదవ్ చెప్పారు.
ఓబిసి(OBC) డిపార్ట్మెంట్ వర్కింగ్ ఛైర్మన్‌గా నియమించినందుకు ఏఐసీసీ, టిపిసిసి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు యూవీ సురేష్ యాదవ్. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నాయకుల ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, ఓబీసీల సంక్షేమానికి కృషి చేస్తానని యూవీ సురేష్ యాదవ్ తెలిపారు. బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. యువకులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.నేటి యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని తెలిపారు.